Header Banner

Puri Jagannadh: పూరీ - సేతుపతి మూవీ.. మరో హీరోయిన్ ఫిక్స్.! ఫొటో షేర్‌ చేసిన టీమ్‌!

  Tue Jun 17, 2025 15:37        Entertainment

యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ‘పాప్‌కార్న్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ కేరళ కుట్టి, తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త, ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా ఉంది. ఇప్పటికే తెలుగులో ‘అఖండ-2’, ‘స్వయంభు’ వంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ, తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను అందుకుంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలయికలో రాబోతున్న ఓ భారీ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ బృందం అధికారికంగా వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి: Air India: ప్రమాదం తర్వాత ఫస్ట్ ట్రిప్.. అహ్మదాబాద్-లండన్‌ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. చివరి నిమిషంలో?

 

దర్శకుడు పూరీ జగన్నాథ్ స్వయంగా సంయుక్తకు స్వాగతం పలుకుతూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను పంచుకున్నారు. "ఆమె అడుగులో దయ, కళ్ళలో ఫైర్ ఉంది" అనే ఆసక్తికరమైన వ్యాఖ్యను ఆ పోస్ట్‌కు జోడించి, సినిమాపై అంచనాలను మరింత పెంచారు. పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులు, సినీ వర్గాల్లో దీనిపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఒకప్పటి హీరోయిన్ చార్మీ కౌర్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి టబు, విలక్షణ నటి రాధికా ఆప్టే కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. కాగా, ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Samyuktha Menon #Puri Jagannadh #Vijay Sethupathi #Beggar Movie #Telugu Cinema #Tollywood #Charmme Kaur #Tabu #Radhika Apte #Puri Connects